సుకుమార్ కు మెగా ఛాన్స్..!

టాలీవుడ్ క్రేజీ డైరక్టర్స్ లో ఒకరైన సుకుమార్ ఆర్య నుండి రాబోతున్న రంగస్థలం వరకు తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ ను ఏర్పరచుకున్నాడు. ప్రస్తుతం రాం చరణ్ తో రంగస్థలం సినిమాతో వస్తున్న సుకుమార్ కు ఇప్పుడు ఓ అద్భుతమైన అవకాశం వచ్చిందని టాక్. అదేంటి అంటే ఏకంగా మెగాస్టార్ ను డైరెక్ట్ చేసే అవకాశం వచ్చిందట. ఖైది నంబర్ 150తో రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ ప్రస్తుతం సైరా నరసింహారెడ్డి సినిమా చేస్తున్నాడు. 

2019 సంక్రాంతి కల్లా ఈ సినిమా రిలీజ్ అవనుందట. ఇక ఈ సినిమా తర్వాత అసలైతే బోయపాటి శ్రీనుతో చిరంజీవి సినిమా ఉంటుందని అన్నారు కాని ఈమధ్యనే సుకుమార్ చిరుకి ఓ కథ వినిపించాడట. సుక్కు చెప్పిన లైన్ నచ్చిన చిరు డెవలప్ చేయమని అన్నాడట. మొత్తానికి సుకుమార్ మరో మెగా ఛాన్స్ పట్టాడని అంటున్నారు. క్రియేటివిటీతో ప్రేక్షకులను మెప్పిస్తున్న సుకుమార్ మెగాస్టార్ తో ఎలాంటి సినిమా తీస్తాడో అని ఇప్పటి నుండే అంచనాలు మొదలయ్యాయి.

ఇక చరణ్ తో చేస్తున్న రంగస్థలం టీజర్ అదిరిపోయింది. చరణ్ కెరియర్ లో ఈ సినిమా ప్రత్యేకంగా నిలుస్తుందని టీజర్ చూస్తేనే చెప్పేయొచ్చు. మార్చి 30న రిలీజ్ అవుతున్న రంగస్థలం హిట్ అయితే ఇక సుకుమార్ మెగాస్టార్ ఛాన్స్ వచ్చేసినట్టే.