
రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజ్ అయిన స్వీటీ అనుష్క భాగమతి అంచనాలను అందుకోవడంలో సక్సెస్ అయ్యింది. పిల్ల జమిందార్ కిశోర్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా యువి క్రియేషన్స్ వారు నిర్మించారు. అనుష్క తన నట విశ్వరూపం చూపించిందని చెప్పాలి. అయితే సినిమాలో మరో అంశం ప్రేక్షకులను బాగా ఇంప్రెస్ చేసింది అదే తమన్ మ్యూజిక్. సినిమా ఫీల్ ను ఏమాత్రం మిస్ అవ్వకుండా తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తన కెరియర్ కే బెస్ట్ బి.జి.ఎం అని అంటున్నారు.
సినిమా హిట్ కు ప్రధాన బాధ్యత వహించిన వారిలో తమన్ పేరు కూడా తప్పకుండా ఉంటుంది. ముఖ్యంగా తమన్ ఫ్యాన్స్ ఈ సినిమాను స్పెషల్ గా చెప్పుకుంటున్నారు. భాగమతి సినిమాకు తమన్ చేసిన మ్యూజిక్ మ్యాజిక్ వారెవా అనేలా చేసింది. ఈ ఇయర్ అసలు సిసలైన సక్సెస్ భాగమతి అందుకుందని చెప్పడంలో సందేహం లేదు.
సినిమా మీద అంత కాన్ఫిడెంట్ ఉంది కాబట్టే యువి క్రియేషన్స్ వారు తెలుగులోనే కాదు తమిళ, మలయాళ భాషల్లో కూడా ఈ సినిమాను రిలీజ్ చేశారు. విజువల్ గ్రాండియర్ గా వచ్చిన భాగమతి అరుంధతి రేంజ్ కాకున్నా ఆ సినిమా హిట్ జోష్ ను కొనసాగిస్తుంది.