రకుల్ ఆ హీరోతో డేటింగ్ లో ఉందా..!

క్రేజీ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ హీరోతో డేటింగ్ లో ఉందన్న వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఆ హీరోతో రకుల్ పార్టీలు, పబ్బులు వెంట తిరుగుతుందని.. వాళ్లిద్దరు డేటింగ్ లో ఉన్నారని టాక్. అంతేకాదు రకుల్ తో డేటింగ్ లో ఉన్న హీరో ఎవరో కాదు భళ్లాలదేవ రానా దగ్గుబాటి అని న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. సినిమాల పరంగా ఎంత దూసుకెళ్తాడో ఫ్రెండ్ షిప్ లో కూడా అదే రేంజ్ లో దూసుకెళ్తున్నాడు రానా.


ఇప్పటికే టాలీవుడ్ హీరోయిన్స్ అందరితో చనువుగా ఉండే రానా రకుల్ తో లవ్ లో పడ్డడన్నది లేటెస్ట్ టాక్. అయితే ఈ వార్తలకు స్పందించిన రకుల్ కేవలం తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమే అంటుంది. రానా మాత్రం ఇలాంటి రూమర్స్ కామనే అంటూ కొట్టిపారేస్తున్నాడు. రోజుకో కొత్త హీరోయిన్ ఎంట్రీ ఇస్తున్న టాలీవుడ్ లో రకుల్ కొన్నాళ్లు కొనసాగాలంటే మాత్రం ఇలాంటి వాటికి దూరం ఉండాల్సిందే. మరి అమ్మడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో చూడాలి.