ఇన్ స్టాగ్రాంలో మహేష్ బీభత్సం..!

సౌత్ లో క్రేజీ ఫ్యాన్స్ ఉన్న స్టార్ లో మహేష్ బాబు ఒకరు. టాలీవుడ్ లో అయితే ఇక చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా ఫలితాలతో సంబందం లేకుండా మహేష్ ఫేవరిజం ఉంటుంది. బ్రహ్మోత్సవం, స్పైడర్ సినిమాలు నిరాశ పరచినా సరే మహేష్ ప్రతి అప్డేట్ తెలుసుకునేందుకు ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తారు. ఇక ప్రస్తుతం మహేష్ కొరటాల శివ డైరక్షన్ లో భరత్ అనే నేను సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా ప్రమోషనల్ యాక్టివిటీస్ రేపు అనగా జనవరి 26న ఉదయం 7 గంటల నుండి మొదలు పెడుతున్నారు. ఇందులో మహేష్ సిఎం కాబట్టి మొదటి ప్రమాణ స్వీకారంతోనే మొదలు పెడుతున్నారు. రెండు రోజుల క్రితం మహేష్ ఇన్ స్టాగ్రాం లోకి వచ్చాడు. వచ్చి 48 గంటలు అవుతున్నాయో లేదో పెట్టిన తన సినిమా కాన్సెప్ట్ పోస్టర్ కే 6.8 లక్షల ఫాలోవర్స్ ను ఏర్పరచుకున్నాడు మహేష్. ఇదో రకంగా మహేష్ క్రేజ్ కు నిదర్శనమని చెప్పొచ్చు. డివివి దానయ్య నిర్మిస్తున్న కొరటాల శివ మూవీ భరత్ అనే నేను టైటిల్ ప్రచారంలో ఉంది.