టచ్ చేసి చూడు ట్రైలర్.. రవితేజ మార్క్ తగ్గట్టే..!

రెండేళ్ల గ్యాప్ తర్వాత రాజా ది గ్రేట్ తో హిట్ అందుకున్న మాస్ మహరాజ్ రవితేజ విక్రం సిరికొండ డైరక్షన్ లో టచ్ చేసి చూడు సినిమా చేస్తున్నాడు. రీసెంట్ గా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ మూవీ ఫిబ్రవరి 2న రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా ట్రైలర్ కొద్ది గంటల క్రితం రిలీజ్ చేశారు. రవితేజ మార్క్ మాస్ మసాలా మూవీగా ఇది రాబోతుందని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. 

విక్రమార్కుడు, పవర్ సినిమాల్లో రవితేజ పోలీస్ గా విజృంభించాడు. చూస్తుంటే ఆ హిట్ సినిమాల సరసన టచ్ చేసి చూడు కూడా చేరేలా ఉంది. గెడ్డం లుక్ లో రవితేజ క్రేజీగా ఉన్నాడు. రాశి గ్లామర్ కూడా సినిమాకు అదనపు ఎట్రాక్షన్ గా నిలిస్తుందని అంటున్నారు. నల్లమలపు శ్రీనివాస్, వళ్లభనేని వంశీ నిర్మించిన ఈ సినిమాలో సీరత్ కపూర్ కూడా సెకండ్ హీరోయిన్ గా నటించింది.