
సూపర్ స్టార్ రజినికాంత్ పా. రంజిత్ డైరక్షన్ లో వస్తున్న సినిమా కాలా. ధనుష్ నిర్మిస్తున్న ఈ సినిమా కథ తనదే అంటూ రాజశేఖరన్ అనే అసిస్టెంట్ డైరక్టర్ కోర్ట్ మెట్లు ఎక్కాడు. పది సంవత్సారల క్రితమే తాను కరికాలన్ అనే టైటిల్ తో ఈ కథ రాసుకున్నానని. రైటర్స్ అసోషియేషన్స్ లో కూడా ఈ కథ రిజిస్టర్ చేయించానని అంటున్నాడు రాజశేఖరన్.
ఫిర్యాదు స్వీకరించిన మద్రాస్ హై కోర్ట్ ఫిబ్రవరి 12లోగా చిత్రయూనిట్ దీనికి స్పందించాలని నోటీసులు పంపించారు. దర్శకుడు రజింత్, హీరో రజినికాంత్, నిర్మాత ధనుష్ లకు వేరు వేరు నోటీసులు పంపించారు. అయితే గొడవ పెద్దవుతున్నా సరే కాలా యూనిట్ మాత్రం వీటిని పట్టించుకోకుండా పోస్ట్ ప్రొడక్షన్ పనిలో నిమగ్నమైంది. ఇక ఈ సినిమాతో పాటుగా రజిని శంకర్ డైరక్షన్ లో 2.ఓ సినిమా చేస్తున్నాడు.