ఒక్క ఫ్లాప్ కే టీంను మారుస్తారా..!

పవన్ త్రివిక్రం కాంబోలో వచ్చిన అజ్ఞాతవాసి ఫ్లాప్ కారణం చేత త్రివిక్రం తన టీం మారుస్తున్నాడు అన్నది లేటెస్ట్ ఫిల్మ్ నగర్ టాక్. ఖలేజా తర్వాత కాస్త జాగ్రత్త పడిన త్రివిక్రం ఆ తర్వాత అన్ని సినిమాలు మినిమం గ్యారెంటీ హిట్లు ఇచ్చాడు. కథ కథనాలు ఎలా ఉన్నా తన పెన్ పవర్ తో సత్తా చాటుకుంటూ వచ్చాడు. అయితే అజ్ఞాతవాసికి మాత్రం తన పెన్ను అరిగిందన్న కామెంట్లు వచ్చాయి.

సినిమా ఫ్లాప్ అవడం ఒక ఎత్తైతే.. సినిమా కాపీ అన్నది ఎక్కువ ఇంపాక్ట్ కలిగించింది. అయితే ఈ సినిమా ఫ్లాప్ తో కాస్త డిస్ట్రబ్ అయిన త్రివిక్రం డైరక్షన్ టీం మారుస్తున్నాడని అంటున్నారు. కాని కొందరు మాత్రం ఇవన్ని మీడియా సృష్టించిన రూమర్స్ మాత్రమే తప్ప త్రివిక్రం తన టీంలో ఎలాంటి మార్పు చేయట్లేదని అంటున్నారు. ప్రస్తుతం తారక్ తో సినిమాకు సిద్ధమవుతున్న త్రివిక్రం ఫిబ్రవరిలో ఆ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నాడు.