రంగస్థలం టీజర్.. సౌండ్ ఇంజినీర్ వచ్చాడు..!

సుకుమార్, రాం చరణ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా రంగస్థలం. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజ్ అయ్యింది. సినిమా అంచనాలకు తగ్గట్టుగానే చిట్టిబాబుగా రాం చరణ్ అదరగొట్టాడు. ఈ ఊరికి మనమే ఇంజినీర్.. అందరి సౌండ్ వినపడ్డండి.. నాకు సౌండ్ కనబడిద్దండి.. అంటూ తన లోపాన్ని కవర్ చేసుకున్న హీరో.. పెదాల కదలిక పట్టి అవతల వాళ్లు ఏమంటున్నారో అర్ధం చేసుకుంటాడు.

ఇక మా ఊరి పేరు రంగస్థలం.. దేవి మ్యూజిక్ హైలెట్ గా వచ్చిన ఈ టీజర్ లో చరణ్ లుక్ అదుర్స్.. ఇక సుకుమార్ మార్క్ టాలెంట్ కనబడింది. మార్చి 30న రంగస్థలం రాబోతుంది. టీజర్ చూస్తే సినిమాలో మ్యాటర్ గట్టిగానే ఉన్నట్టు కనిపిస్తుంది. స్టార్ హీరోగా చరన్ చెవిటి వాడిగా గొప్ప ప్రయత్నమే చేశాడు. మరి ఈ సినిమా చరణ్ సక్సెస్ మేనియా కంటిన్యూ చేస్తుందా లేదా అన్నది చూడాలి.