12 కోట్లెక్కడ.. కోటెక్కడ.. పాపం టాప్ డైరక్టర్..!

హిట్లు కొడితే ఏ రేంజ్ క్రేజ్ ఉంటుందో.. వరుసగా ఫ్లాపులు కొడితే పరిస్థితి అంతకంటే దారుణంగా ఉంటుంది. టాలీవుడ్ టాప్ డైరక్టర్ గా పేరు తెచ్చుకున్న వారిలో ఒకరైన శీనువైట్ల ఇప్పుడు కష్టాల్లో ఉన్నాడని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవితో సైతం సినిమాలు చేసి టాప్ డైరక్టర్ అనిపించుకున్న వైట్ల శ్రీను ఇప్పుడు తనకు సినిమా అవకాశం ఇచ్చే నిర్మాత కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చింది.

అంతేకాదు రెమ్యునరేషన్ పరంగా కూడా పూర్తిగా తగ్గించేశాడట. మహేష్, ఎన్.టి.ఆర్, చరణ్ లతో సినిమా చేసే టైం లో సినిమాకు 10 నుండి 12 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకున్న శ్రీను వైట్ల ఇప్పుడు కోటిస్తే చాలు సినిమా చేసి పెడతా అంటున్నాడట. లాస్ట్ ఇయర్ వరుణ్ తేజ్ మిస్టర్ తో కూడా మరో ఫ్లాప్ తన ఖాతాలో వేసుకున్న శ్రీను వైట్ల ప్రస్తుతం రవితేజతో సినిమా చేయాలని చూస్తున్నాడు. రాధామోహన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు కేవలం కోటి చాలని చెబుతున్నాడట. మరి ఈ సినిమా హిట్ కొట్టి మళ్లీ శ్రీను వైట్ల మునుపటి ఫాం లోకి వస్తాడేమో చూడాలి.