
నాచురల్ స్టార్ గా తన నాచురల్ నటనతో ఆకట్టుకుంటున్న నాని ప్రస్తుతం కృష్ణార్జున యుద్ధం సినిమా చేస్తున్నాడు. మేర్లపాక గాంధి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో నాని డ్యుయల్ రోల్ చేస్తాడని తెలుస్తుంది. ఇక ఈ సినిమాతో పాటుగా సావిత్రి బయోపిక్ గా వస్తున్న మహానటిలో కూడా నటిస్తున్నాడట నాని. సినిమాలో నాని ఎన్.టి.ఆర్ రోల్ కనిపిస్తారట.
ఎన్.టి.ఆర్ గా నాని అంటే కచ్చితంగా గొప్ప విషయమే. ముందు ఈ పాత్రకు జూనియర్ ను అడుగగా సున్నితంగా తిరస్కరించాడు. అయితే నాని కూడా ముందు కాదన్నా తర్వాత ఒప్పించారట. అయితే ఇన్నాళ్లు వివాదాలకు దూరంగా ఉంటూ వస్తున్న నాని ఎన్.టి.ఆర్ గా అంటే కచ్చితంగా ఎక్కడో తేడా కొడుతుందని అంటున్నారు. మహానటి గా కీర్తి సురేష్ నటిస్తున్న ఈ సినిమాలో ఏయన్నార్ గా విజయ్ దేవరకొండ.. శివాజి గణేషన్ గా దుల్ఖర్ సల్మాన్ నటిస్తున్నారు.