మహేష్ 'భరత్ అనే నేను'.. రికార్డుల వేట..!

శ్రీమంతుడు కాంబినేషన్ లో మహేష్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమా రికార్డుల వేట మొదలు పెట్టింది. సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా మహేష్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అదరగొడుతుంది. శ్రీమంతుడు లాంటి హిట్ ఇచ్చిన ఈ కాంబినేషన్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. సోషల్ మెసేజ్ తో రాబోతున్న ఈ సినిమాలో మహేష్ సిఎం గా కనిపించనున్నాడు. 

ఇప్పటికే ఈ సినిమా శాటిలైట్ రైట్స్ స్టార్ మా 39 కోట్లకు కొనేసిందని తెలిసిందే. తెలుగు హింది శాటిలైట్ రైట్స్ కలిపి ఈ రేంజ్ లో బిజినెస్ చేసింది. ఇక ఇప్పుడు అమేజాన్ ప్రైం డిజిటల్ రైట్స్ లో కూడా భరత్ అనే నేను భారీ మొత్తానికి వెళ్లిందట. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. బిజినెస్ రేంజ్ భారీగా ఉన్నా సినిమా రిలీజ్ తర్వాత కలక్షన్స్ కూడా ఇదే రేంజ్ లో ఉండాలని ఆశిస్తున్నారు అభిమానులు.