సుచీ లీక్స్.. అగైన్ స్టార్ట్..!

కోలీవుడ్ సెలబ్రిటీస్ కు ముచ్చెమటలు పట్టేలా చేసిన సుచి లీక్స్ గురించి అందరికి తెలిసిందే. సుచి లీక్స్ పేరుతో సింగర్ సుచిత్ర చేసిన హంగామా అంతా ఇంతా కాదు. హీరో హీరోయిన్స్ ప్రైవేట్ వీడియోస్ బట్టబయలు చేసిన ఈ అమ్మడు మతిస్థిమితం బాలేదని.. ఎవరో తెలియని వ్యక్తులు తన ట్విట్టర్ ను హ్యాక్ చేశారని అప్పట్లో అన్నది. అయితే ఇప్పుడు మళ్లీ అమ్మడు ఆ లీక్స్ గురించి నోరు విప్పింది. 

తాను ఎలా వెళ్లానో.. అలా వచ్చానని.. త్వరలో మరికొందరి సీక్రెట్ లీక్స్ బయట పెడతానని అంటుంది సుచిత్ర. వెడియో మెసేజ్ పెట్టిన అమ్మడు ఈసారి డైరెక్ట్ గా రంగంలోకి దిగడం కాస్త షాకింగ్ గానే ఉంది. మరి ఈసారి ఎవరి సీక్రెట్ వీడియోస్ రిలీజ్ చేయబోతుందో అంటూ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అప్పట్లో ఈ వ్యవహారానికి సర్దుమనిగేలా బేరం మాట్లాడుకున్నారని అన్నారు. మరి బేరం సరిగా కుదర్లేదా లేక మరే కారణమో కాని సుచీ లీక్స్ ఏగైన్ సెన్సేషన్ గా మారనున్నాయి.