ప్రభాస్ దేవుడంటున్న డైరక్టర్..!

యువి క్రియేషన్స్ బ్యానర్లో పిల్ల జమిందార్ అశోక్ డైరక్షన్ లో స్వీటీ అనుష్క లీడ్ రోల్ లో చేస్తున్న సినిమా భాగమతి. ఈ సినిమా టీజర్ ట్రైలర్ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడేలా చేయగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిత్రయూనిట్ అంతా సినిమా పక్కా హిట్ అన్నట్టు మాట్లాడటం విశేషం. ఇక సినిమా గురించి డైరక్టర్ అశోక్ మాట్లాడుతూ ఈ సినిమా తెరకెక్కడానికి ముఖ్య కారణం ప్రభాస్ అందుకే ఆయన దేవుడు అంటూ చెప్పుకొచ్చాడు అశోక్.

మాములుగా కష్టపడితే విజయం దక్కుతుందని.. ఎలాగైనా గెలవాలి అనుకుంటే మోసం మొదలవుతుందని.. తాను గెలుస్తూ ఇతరుల గెలుపు ఆకాక్షించే వాళ్లు దైవత్వం కలిగి ఉంటారని.. ఆ రకంగా ఆలోచిస్తాడు కాబట్టి ప్రభాస్ తనకు దేవుడిలా కనిపిస్తాడని అంటున్నాడు అశోక్. భాగమతి సినిమా కథ ప్రభాస్ కు వినిపించగా తనే దగ్గరుండి అనుష్క, యువి క్రియేషన్స్ ను ఒప్పించారని అన్నాడు అశోక్.  

ఇక అనుష్క కష్టం గురించి కూడా అశోక్ తన మాటల్లో చెప్పాడు. ఇంతలా కష్టపడే నటిని తానెప్పుడు చూడలేదని అన్నాడు. అనుష్క కెరియర్ లో ఈ సినిమా మరో మైలురాయిగా నిలుస్తుందని అన్నాడు అశోక్.