బిగ్ బాస్ బేబీ.. ప్రభాస్ తో చాన్స్

హింది బిగ్ బాస్ లో లేటెస్ట్ సీజన్ లో సంచలనం సృష్టించిన అర్షి ఖాన్ అందరికి తెలిసిందే. తెలుగు ప్రేక్షకులకు అంత తెలియకపోయినా బిగ్ బాస్ షోలో అమ్మడు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఎలాగైనా షోలో నిలబడాలన్న ఆలోచనతో అర్షి చేసిన హంగామా అందరు షాక్ అయ్యేలా చేసింది. ఇక ఇప్పుడు ఈ అమ్మడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన ఛాన్స్ కొట్టేసిందని అంటున్నారు.

ఈ విషయాన్ని అమ్మడు తన ట్విట్టర్ ద్వారా ఎనౌన్స్ చేసింది. ప్రభాస్ ప్రస్తుతం సాహో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాలో శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. అర్షి ఖాన్ సెకండ్ లీడ్ గా చేసే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ప్రభాస్ తో తాను చేసే లీడ్ రోల్ అంటూ చెప్పిన అమ్మడి మాటలు ఎంతవరకు నమ్మాలో తెలియట్లేదు. 

బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న సాహోని సుజిత్ డైరెక్ట్ చేస్తున్నాడు. యువి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ, హింది భాషల్లో నిర్మిస్తున్నారు.