మహేష్ వర్సెస్ బన్ని.. కాంప్రమైజ్ అయినట్టేనా..!

సమ్మర్ వార్లో సత్తా చూపించేందుకు ఇద్దరు స్టార్స్ సిద్ధంగా ఉన్నారు. ఓ వైపు మహేష్ కొరటాల శివతో భరత్ అనే నేను సినిమాతో దూసుకు వస్తుంటే.. మరో పక్క అల్లు అర్జున్ నా పేరు సూర్య అంటూ హంగామా చేసేందుకు వస్తున్నాడు. ఈ రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అనేసరికి ఇంట్రెస్టింగ్ గా మారింది. అయితే రెండు సినిమాల దర్శక నిర్మాతల చర్చల అనంతరం మహేష్ సినిమాను అనుకున్న డేట్ కు వచ్చేలా మాట్లాడారట.

మొత్తానికి బన్ని కాస్త వెనక్కి తగ్గాడని చెప్పొచ్చు. వక్కంతం వంశీ డైరక్షన్ లో బన్ని చేస్తున్న నా పేరు సూర్య మూవీ టీజర్ తో అంచనాలను పెంచేసింది. సినిమాపై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్న బన్ని రిలీజ్ డేట్ విషయంలో పట్టుబట్టలేదట. అందుకే ఏప్రిల్ 27 నుండి నా పేరు సూర్య ఏప్రిల్ 13కి ప్రీ పోన్ అయ్యిందని అంటున్నారు. మరి ఆ డేట్ న నాని కృష్ణార్జున యుద్ధం రిలీజ్ ఎనౌన్స్ చేశారు. బన్నితో ఫైట్ కు నాని సై అంటాడా లేడా అన్నది చూడాలి.