ఆ సూపర్ హిట్ భాగమతి అవుతుంది..!

స్వీటీ అనుష్క లీడ్ రోల్ లో పిల్ల జమిందార్ అశోక్ డైరక్షన్ లో వస్తున్న సినిమా భాగమతి. యువి క్రియేషన్స్ బ్యానర్లో వస్తున్న ఈ సినిమా ఈ నెల 26న రిలీజ్ అవనుంది. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం జరిగింది. అల్లు అరవింద్ చీఫ్ గెస్ట్ గా రాగా నాచురల్ స్టార్ నాని కూడా ఈ ఈవెంట్ లో పాల్గొన్నాడు. ఇక ఈ సినిమాతో స్వీటీ మరో హిట్ కొట్టడం గ్యారెంటీ అని అంటున్నాడు నాని.


ప్రతి ఇంటిలో ఓ సూపర్ స్టార్ ఉన్నట్టు తన ఇంటిలో అనుష్క ఉందని.. ఆమెపై అభిమానాన్ని బయటపెట్టాడు నాని. తెలిసిన ఫ్రెండ్ ద్వారా ఇంటర్వల్ సీన్ తెలిసిందని.. కచ్చితంగా ఈ ఇయర్ మొదటి సూపర్ హిట్ భాగమతి అవుతుందని చెప్పుకొచ్చాడు నాని. అనుష్క డ్యుయల్ రోల్ చేసిన ఈ సినిమా తెలుగు తమిళ భాషల్లో రిలీజ్ అవుతుంది. తమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో ఉన్ని ముకుందన్, ఆది పినిశెట్టి కూడా ప్రధాన పాత్రలుగా నటిస్తున్నారు.