
ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాకు బ్యాడ్ డేస్ అన్నట్టు పరిస్థితులు కనబడుతున్నాయి. ఓ పక్క అజ్ఞాతవాసి సినిమా ఫలితం నిరాశ పరచడమే షాక్ ఇవ్వగా ఆ సినిమాపై వచ్చిన కాపీ అలిగేషన్స్ పెద్ద తలనొప్పిగా మారాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు మహేష్ కొరటాల శివ కాంబోలో వస్తున్న భరత్ అనే నేను సినిమాకు కాపీ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
90ల్లో వచ్చిన ఓ హాలీవుడ్ సినిమాకు కాపీగా ఈ సినిమా కథ ఉండబోతుందని అంటున్నారు. శ్రీమంతుడు తర్వాత కొరటాల శివ మహేష్ కాంబోలో వస్తున్న ఈ సినిమా కథను శ్రీహరి నాను దగ్గర నుండి కోటి రూపాయలిచ్చి మరి కొనేశాడట కొరటాల శివ. అయితే ఇప్పుడు ఈ కథ కూడా కాపీ అంటూ వార్తలు వస్తున్నాయి. మరి అజ్ఞాతవాసి సినిమా కష్టాలు తెలిసి కూడా మహేష్ ఈ రిస్క్ తీసుకుంటాడా అన్నది హాట్ న్యూస్ గా మారింది.