
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ డైరక్షన్ లో నా పేరు సూర్య సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తి కావొస్తున్న సందర్భంగా తన తర్వాత సినిమా విశేషాలు గురించి ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. తెలుస్తున్న సమాచారం ప్రకారం విఐ ఆనంద్ డైరక్షన్ లో అల్లు అర్జున్ సినిమా చేస్తాడని అంటున్నారు. ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో హిట్ అందుకున్న ఆనంద్ ఆ తర్వాత ఒక్క క్షణం అంటూ వచ్చి అలరించాడు.
కథ కథనాలు బాగున్నా సినిమా ఎందుకో కమర్షియల్ గా వర్క్ అవుట్ కాలేదు. అయినా సరే అల్లు అర్జున్ కు అదిరిపోయే కథ సిద్ధం చేశాడట. బన్ని కూడా విఐ ఆనంద్ కు ఓకే చెప్పాడని టాక్. గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తుంది. త్వరలో ఈ సినిమాకు సంబందించిన అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ రానుంది.