నిర్మాతలకు ఐటి షాక్..!

సంక్రాంతి రిలీజ్ అయిన సినిమా నిర్మాణ సంస్థల మీదే కాదు టాలీవుడ్ లో ఉన్న బడా నిర్మాణ సంస్థల మీద ఒక్కసారిగా ఆదాయపు పన్ను శాఖ వారు సోదారు జరపడం జరిగింది. వారు చెల్లిపులకు సంబందించిన టిడిఎస్ కట్ చేస్తున్నారా.. వాటిని ఆదాయపు పన్ను శాఖకు కడుతున్నారా లేదా అన్న కోణంలోనే సోదాలు జరిపారట. ముఖ్యంగా సంక్రాంతికి రిలీజ్ అయిన జై సింహా నిర్మాత సి కళ్యాణ్, అజ్ఞాతవాసి నిర్మాత కె రాధాకృష్ణ ఇళ్లు, ఆఫీస్ లలో ఈ రైడ్ జరిపినట్టు తెలుస్తుంది.

వీరే కాకుండా సురేష్ బాబుకి ఐటి షాక్ తగిలినట్టు తెలుస్తుంది. అనూహ్యంగా టాలీవుడ్ నిర్మాతల మీద ఈ ఐటి దాడులకు కారణం ఏమై ఉంటుందో తెలియాల్సి ఉంది. ఇవే కాకుండా భవ్య క్రియేషన్స్, నార్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ సంస్థలకు ఈ ఐటి షాక్ తగిలినట్టు తెలుస్తుంది. మరి అక్కడ ఐటి వాళ్లు ఏదైనా గుర్తించారా లేదా అన్నది మాత్రం బయటకు రాలేదు.