
సూపర్ స్టార్ మహేష్ ఏంటి కాలకేయ ప్రభాకర్ కు గురువవ్వడం ఏంటని కాస్త షాక్ అవ్వొచ్చు. బాహుబలి సినిమాలో కాలకేయగా ప్రభాకర్ తెచ్చుకున్న గుర్తింపు అంతా ఇంతా కాదు. రాజమౌళి డైరక్షన్ లో వచ్చిన మర్యాదరామన్న సినిమాతో మంచి బ్రేక్ తెచ్చుకున్నాడు ప్రభాకర్. అయితే తనకు మహేష్ గురువు.. రాజమౌళి దేవుడు అంటున్నాడు. మహేష్ గురువెలా అయ్యాడు అంటే మహేష్ సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వచ్చిన అతిథి సినిమాలో ఓ ఫైట్ సీన్ కోసం ప్రభాకర్ నటించాడట.
కత్తి పట్టుకోవాల్సి ఉండగా.. దానికి తను ఇబ్బంది పడుతుంటే మహేష్ సపోర్ట్ ఇచ్చారని అన్నాడు. ఇక మర్యాదరామన్న తన కెరియర్ ను ఎక్కడికో తీసుకెళ్లిందని అందుకే ఆ టైంలోనే తనకు పెళ్లి అయ్యిందని.. ఆ సినిమా ఆడియో ఫంక్షన్ లో తన భార్య డెలివరీ అవగా తన కొడుకుకి రాజమౌళి అని పేరు పెట్టానని అన్నాడు ప్రభాకర్. ఈ విషయం బాహుబలి ఆడియో ఫంక్షన్ దాకా రాజమౌళికి తెలియదని.. తెలుసుకుని రాజమౌళి సంతోషించారని అన్నాడు ప్రభాకర్.