
బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న మెగా నందమూరి మల్టీస్టారర్ సినిమాపై రోజుకో కథ బయటకు వస్తుంది. ఇన్నాళ్లు సినిమా ఓ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో వస్తుందని.. ఇద్దరు హీరోలు బాక్సర్స్ గా కనిపిస్తారని అన్నారు. కాని రాజమౌళికి బాగా తెలిసిన వారు చెబుతున్న సమాచారం ప్రకారం సినిమా కంప్లీట్ ఫ్యామిలీ డ్రామాగా వస్తుందట. కేవలం సెంటిమెంట్ మీదనే సినిమా నడుస్తుందని టాక్.
ఇప్పటికే ఫైనల్ స్క్రిప్ట్ రెడీ అవగా.. దాని మీద వర్క్ చేస్తున్నారట. అక్టోబర్ లో మొదలవనున్న ఈ సినిమా 2019 సమ్మర్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా బడ్జెట్ 150 కోట్ల పైనే అంటున్నారు. తెలుగు, తమిళ, హింది భాషల్లో ఈ సినిమా తెరకెక్కిస్తారని తెలుస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్స్ గా బాలీవుడ్ భామలను దించే ప్రయత్నంలో ఉన్నారు దర్శక నిర్మాతలు.