
నాచురల్ స్టార్ నాని.. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్న ఈ పేరు వింటే స్టాస్ కూడా భయపడే పరిస్థితి వచ్చిందని చెప్పొచ్చు. నాని సినిమా ఎప్పుడొచ్చినా హిట్టే. రీసెంట్ గా ఇయర్ ఎండింగ్ కు వచ్చిన ఎం.సి.ఏ తో నాని మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. హిట్ పడ్డది కదా అని రిలాక్స్ అవకుండా తను చేస్తున్న కృష్ణార్జున యుద్ధం ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టాడు నాని.
మేర్లపాక గాంధి డైరక్షన్ లో వస్తున్న కృష్ణార్జున యుద్ధం సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ సంక్రాంతి కానుకగా రిలీజ్ అవగా ఇక ఈరోజు కనుమ సందర్భంగా సినిమాలో మొదటి సాంగ్ రిలీజ్ చేశారు. మాస్ బీట్ తో వచ్చిన ఈ సాంగ్ ఆడియెన్స్ ను అలరిస్తుంది. హిప్ హాప్ తమిళ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. నాని ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ కృష్ణార్జున యుద్ధం ఏప్రిల్ 14న రిలీజ్ చేస్తారని తెలుస్తుంది.