
సూపర్ స్టార్ మహేష్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమా భరత్ అను నేను సినిమా అసలైతే ముందు సంక్రాంతి రేసులో ఉంటుందని అనుకోగా అది మిస్ అయ్యి సమ్మర్ వార్ లో దిగుతుందని అన్నారు. అయితే ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్నా సినిమా అనుకున్న ఏప్రిల్27న రావడం కష్టమని అంటున్నారు. తెలుస్తున్న సమాచారం ప్రకారం మహేష్ మూవీ జూన్ కు వాయిదా పడుతుందని అంటున్నారు.
మహేష్ సిఎంగా నటిస్తున్న ఈ సినిమ కొరటాల శివ చాలా జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నారట. బ్రహ్మోత్సవం, స్పైడర్ సినిమాలు నిరాశ పరచగా మహేష్ ఈ సినిమాతో ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో కైరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. మే నెల మహేష్ కు బ్యాడ్ సెంటిమెంట్ ఉంది అందుకే ఏప్రిల్ మిస్ అయితే జూన్ కు పోస్ట్ పోన్ చేస్తున్నారట.