పవన్ తో బోయపాటి సినిమా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా రిజల్ట్ సంతృప్తి ఇవ్వకపోవడంతో ఇక తన సినిమాల స్పీడ్ పెంచాలని చూస్తున్నాడు. త్రివిక్రం, పవన్ క్రేజీ కాంబినేషన్ లో సినిమా మరి ఇంత దారుణమైన టాక్ తెచ్చుకోవడం ఆశ్చర్యంగానే ఉంది. ఇక ఈ సినిమా తర్వాత నీషన్ డైరక్షన్ లో పవన్ ఓ సినిమా చేస్తాడని అంటున్నారు. అయితే పవన్ డైరక్టర్స్ లిస్ట్ లో బోయపాటి శ్రీను కూడా చేరాడని టాక్.

జయ జానకి నాయకా సినిమా తర్వాత రాం చరణ్ తో సినిమా ఫిక్స్ చేసుకున్న బోయపాటి ఆ సినిమా కన్నా ముందు పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడట. ఇప్పటికే దానికి సంబందించిన కథ సిద్ధం చేశాడట. పవన్ కు వినిపించి ఓకే చేయించుకోవడమే మిగిలి ఉందని అంటున్నారు. మొత్తానికి బోయపాటితో పవన్ సినిమా అంటే బాక్సులు బద్ధలయ్యే సినిమా వస్తుందని పవర్ స్టార్ ఫ్యాన్స్ అప్పుడే అంచనాలు పెంచేస్తున్నారు.