వరంగల్ అమ్మాయినే పెళ్లిచేసుకుంటా..!

అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ క్రేజీ హీరోగా మారిన విజయ్ దేవరకొండ హన్మకొండలో షాప్ ఓపెనింగ్ కు వచ్చారు. రొటీన్ కు భిన్నంగా సినిమాలు చేసుకుంటూ సెపరేట్ ఇమేజ్ ఏర్పరచుకున్న విజయ్ తాను పెళ్లంటూ చేసుకుంటే వరంగల్ అమ్మాయినే పెళ్లిచేసుకుంటా అని అన్నారు. విజయ్ మాటలకు వరంగల్ ఫ్యాన్స్ అంతా సంబరపడ్డారు. ఎవడే సుబ్రమణ్యం సినిమాలో నాని స్నేహితుడిగా నటించిన విజయ్ ఆ తర్వాత పెళ్లిచూపులు సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు. 

ఇక హన్మకొండ షాప్ ఓపెనింగ్ లో వరంగల్ అమ్మాయినే పెళ్లిచేసుకుంటా అని విజయ్ దేవరకొడ మాటలను చూస్తుంటే ఇక్కడ నుండే తనకు లవ్ ప్రపోజల్స్ వచ్చాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి విజయ్ చెప్పిన ఆ వరంగల్ అమ్మాయి ఎవరో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం పరశురాం డైరక్షన్ లో ఓ సినిమా చేస్తున్న విజయ్ మహానటి సినిమాలో కూడా నటిస్తున్నాడు. అర్జున్ రెడ్డి లానే మరో వరుస హిట్లు రెండు కొడితే మనవాడికి స్టార్ ఇమేజ్ వచ్చేసినట్టే.