
యాంకర్ గా అలరించిన ఓంకార్ దర్శకుడిగా కూడా హిట్ అందుకున్నాడు. రాజు గారి గది సినిమా హిట్ తో సత్తా చాటుకున్న ఓంకార్ ఆ సినిమా సీక్వల్ గా వచ్చిన రాజు గారి గది-2తో నిరాశపరచాడు. నాగార్జున లాంటి స్టార్ హీరో ఉన్నా ఓంకార్ ఆకట్టుకోలేదు. ఇక ఈ సినిమా తర్వాత ఓంకార్ కొద్దిపాటి గ్యాప్ తోనే మరో సినిమా కన్ఫాం చేసుకున్నాడు. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఈ సినిమా రాబోతుందట.
ప్రస్తుతం శ్రీవాస్ డైరక్షన్ లో సాక్ష్యం సినిమా చేస్తున్న బెల్లంకొండ శ్రీను ఆ సినిమా షూటింగ్ ముగింపు దశకు రావడంతో వెంటనే మరో సినిమాను లైన్ లో పెట్టాడు. ఓంకార్ కూడా ఈసారి ఓ రెగ్యులర్ కమర్షియల్ సినిమా చేయబోతున్నాడని తెలుస్తుంది. బోయపాటి శ్రీనివాస్ తో జయ జానకి నాయకా సినిమాతో వచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నిలబడేందుకు కష్టపడుతున్నాడు.