
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రం కాంబోలో వస్తున్న అజ్ఞాతవాసి సినిమా యూఎస్ లో టాప్ ట్రెండింగ్ మూవీస్ లో మొదటి స్థానంలో నిలిచింది. ప్రముఖ టికెట్ బుకింగ్ సంస్థ మువీటికెట్స్.కాం మూవీ టికెట్స్ వెళ్లడించగా అందులో పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి 26.5% షేర్ తో టికెట్స్ అమ్ముడై హాలీవుడ్ సినిమాలను సైతం పక్కకు నెట్టి టాప్ ట్రెండింగ్ లో ఉందని తెలుస్తుంది. అజ్ఞాతవాసి తర్వాత వార్తల్లో నిలిచిన జుమాన్జి 12.8 శాతం టికెట్స్ అమ్ముడయ్యాయట.
యూఎస్ లో దాదాపు 570 సెంటర్స్ లో ప్రీమియర్స్ పడుతుండటంతో అజ్ఞాతవాసి అక్కడ రికార్డులు బద్ధలు కొట్టడం ఖాయమని అంటున్నారు. ప్రీమియర్స్ తోనే ఖైది నంబర్ 150 రికార్డులను సైతం బద్ధలు కొడుతుందని అంచనా వేస్తున్నారు. అంతేకాదు పవన్ ఫ్యాన్స్ హంగామా చూస్తుంటే బాహుబలి-2 కలక్షన్స్ టచ్ చేసినా చేసేయొచ్చని టాక్. ఇక తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా అజ్ఞాతవాసి హడావిడి మొదలైంది. ఏపిలో బెనిఫిట్ షోస్ అర్ధరాత్రి నుండి పడుతుండగా తెలంగాణా ప్రభుత్వం మాత్రం నైట్ షోలకు పర్మిషన్ ఇవ్వలేదు.