
సూపర్ స్టార్ రజిని ప్రేమిస్తానంటే ఎవరైనా కాదంటారా చెప్పండి. అయితే ఇప్పుడు ఆయన సూపర్ స్టార్ కాని టీనేజ్ లో కాదు కదా అసలు ఆ విషయానికొస్తే మేకప్ వేస్తేనే సూపర్ స్టార్ గా కనిపించే ఆయన మేకప్ తీస్తే అసలు హీరోలా బిల్డప్పే ఇవ్వరు. ఇక అసలు విషయానికొస్తే ఈమధ్య పొలిటికల్ ఎంట్రీపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన రజినికాంత్ తన టీనేజ్ లవ్ స్టోరీ గురించి రివీల్ చేశాడు. టీనేజ్ లో ఉన్నప్పుడు అందరి లాగానే తాను కూడా ఒకరిని ఇష్టపడ్డానని చెప్పిన రజినికాంత్ తనది ఫెయిల్యూర్ లవ్ స్టోరీ అని చెప్పాడు.
అయితే రజిని ప్రేమించింది ఎవరిని ఏంటి అన్నది మాత్రం బయట పెట్టలేదు. మనవళ్లు, మనవరాళ్లు ఉన్న ఈ సమయంలో తన లవ్ స్టోరీ ఎందుకని పక్కన పెట్టాడు. అయితే ప్రస్తుతం సినిమాలు రాజకీయాలు రెండిటిపై ఫోకస్ పెడుతున్న రజిని త్వరలోనే పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వచ్చేస్తారని తెలుస్తుంది. ఇప్పటికే ఫ్యాన్స్ తో మీటింగులు ఏర్పాటు చేసుకుంటూ వస్తున్న రజినికాంత్.. ఎవరు వచ్చి ఇంటర్వ్యూ అడిగినా సరే కాదనకుండా ఇచ్చేస్తున్నాడు.