పవన్, పూనం అసలు మ్యాటర్ ఇదేనా..!

పవన్ ఫ్యాన్స్ మీద ఎటాక్ చేస్తూ ఇప్పుడు డైరెక్ట్ గా పవన్ అసలు స్వరూపం ఇది అంటూ పూనం కౌర్ మ్యాటర్ ను లాక్కొచ్చిన సదరు వ్యక్తి మహేష్ కత్తికి రెండు రోజుల నుండి సిని పరిశ్రమ నుండి కూడా కొన్ని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే పూనం కౌర్ కు 6 ప్రశ్నలంటూ కత్తి వేసిన సుత్తి ప్రశ్నలకు సమాధానం దొరికేసింది.. ప్రస్తుతం సోషల్ మీడియాలో అవి ట్రెండింగ్ అవుతుండటం విశేషం.

ఈ ఆరు ప్రశ్నలకు సమాధానంగా వచ్చిన ఆన్సర్స్ ఏంటంటే.. పవన్ కళ్యాణ్, త్రివిక్రం కాంబినేషన్ లో వచ్చిన జల్సా సినిమా టైంలో కమిలిని ముఖర్జీ రోల్ కు ముందు పూన కౌర్ ను అనుకున్నారట. కొంత భాగం షూట్ కూడా జరిగిందని టాక్. అయితే ఎందుకో ఆ సినిమా నుండి ఆమెను తప్పించేశారట. షూటింగ్ లో భాగంగానే కత్తి మహేష్ చెప్పినట్టు పూజల్లో పాల్గొనడం, గోత్ర నామాలు చెప్పించడం జరిగింది.  

ఆ సినిమా నుండి బయటకు రావడం ఓర్చుకోలేని పూనం సూసైడ్ అటెంప్ట్ చేసిందని వినికిడి. అందుకే త్రివిక్రం అంటే కోపమని అంటున్నారు. అయితే పవన్ ఆమెను సేవ్ చేశారట. హాస్పిటల్ బిల్స్ కూడా పవన్ కట్టినట్టు సమాచారం. ఇక పవన్ పూనం తల్లికి కూడా ఆమె మంచి పొజిషన్ లో ఉంచుతానని మాటిచ్చారట. అందుకే ఏపి చేనేత బ్రాండ్ ఎంబాసిడర్ గా సిఫార్సు చేశారని టాక్. మొత్తానికి ఇద్దరి మధ్య ఏదో ఉంది అంటూ కత్తి టార్గెట్ చేస్తే కేవలం ఇది మాత్రమే జరిగింది అన్న విషయాలు బయటకు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ మ్యాటర్ తేలికగా వదిలేస్తే రేపు ఇంకొకరు కాజల్, సమంతల విషయాల్లో ఇలానే తలదూర్చుతారని గట్టి కౌంటర్స్ వినబడుతున్నాయి.