ఇది భాగమతి అడ్డా.. లెక్క తేలాల్సిందే..!

స్వీటీ అనుష్క లీడ్ రోల్ లో పిల్లజమిందార్ అశోక్ డైరక్షన్ లో వస్తున్న సినిమా భాగమతి. యువి క్రియేషన్స్ బ్యానర్లో క్రేజీ సినిమాగా వస్తున్న ఈ భాగమతి మూవీ టీజర్ తో అంచనాలు పెంచేసింది. ఇక కొద్ది గంటల క్రితం ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఇది భాగమతి అడ్డా.. లెక్క తేలాల్సిందే. టీజరే అదిరేలా ఉంది అనుకుంటుంటే ఈ ట్రైలర్ మరింత అంచనాలను పెంచేసింది.

సినిమా చూస్తుంటే అరుంధతిలా సస్పెన్స్ థ్రిల్లర్ గా అనిపిస్తుంది. కచ్చితంగా సినిమాలో మ్యాటర్ మాత్రం ఫుల్ గా ఉన్నట్టు తెలుస్తుంది. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను వంశీ, ప్రమోద్ లు నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ సినిమా రిలీజ్ అవుతుంది. జనవరి 26న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ట్రైలర్ ఇంప్రెస్ చేయగా సినిమా ఇంతకంటే సర్ ప్రైజ్ చేస్తుందని అంటున్నారు.

సైజ్ జీరో కోసం అనవసరంగా బరువు పెంచుకుని మాటలు పడ్డ అనుష్క ఈ సినిమాతో మళ్లీ బ్యాక్ టూ ఫాం అనేలా పరిస్థితులు కబడుతున్నాయి. మరి సినిమా ఎలా ఉంటుంది అన్నది రిలీజ్ అయితేనే కాని చెప్పలేం.