
కత్తి మహేష్ వర్సెస్ పవన్ ఫ్యాన్స్ ఫైట్ లో తాజాగా హీరోయిన్ పూనం కౌర్ ఇరుక్కుపోయింది. ప్రెస్ క్లబ్ లో పూనం కౌర్ కు ఆరు ప్రశ్నలంటూ కత్తి మహేష్ చేసిన హంగామా తెలిసిందే. పవన్ పై మహేష్ చేస్తున్న విమర్శలను సహించలేని పూనం పవన్ కు సపోర్ట్ గా మహేష్ కత్తి పేరు కూడా ప్రస్థావించకుండా ట్వీట్ చేసింది. అయితే పూనం కౌర్ ని మాత్రం కత్తి డైరెక్ట్ టార్గెట్ చేశాడు.
పవన్ తో పూనం రిలేషన్ ఏంటి అన్న విధంగా వచ్చే డౌట్లు కలిగే 6 ప్రశ్నలను వేశాడు. అయితే అనవసరంగా ఈ గొడవలో తనని ఇవాల్వ్ చేశారని పూనం వాపోయింది. ఈరోజు కొన్ని ట్వీట్ వేయగా వాటిని వెంటనే డిలీట్ చేసింది. అయితే ఈ విషయం గురించి పవన్ సాయం కోరిందట పూనం. మొత్తానికి కత్తి మహేష్ టార్గెట్ పూనం పై పెట్టు మరో గొడవకు దారి తీశాడు. అయితే మూవీ ఆర్టిస్ట్ అసోశియేషన్ కూడా కత్తి మహేష్ కామెంట్స్ పై సీరియస్ గా ఉన్నారు. గొడవకు ముగింపు పలకాల్సిందిగా కోనా వెంకట్ ట్వీట్ చేశారు. 15 వరకు అటు కత్తి కాని, పవన్ ఫ్యాన్స్ కాని ఎవరు గొడవ చేయొద్ధని ట్వీట్ చేశాడు.