
అక్కినేని అఖిల్ హీరోగా మొదటి సినిమా అఖిల్ డిజాస్టర్ అవగా ఎన్నో అంచనాల నడుమ వచ్చిన హలో కూడా అటు ఇటుగానే అయ్యింది. సినిమా కలక్షన్స్ చూస్తే ఇది కూడా నిరాశ పరచిందని చెప్పొచ్చు. విక్రం కుమార్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా మనం లాంటి మ్యాజిక్ చేయలేకపోయింది. అయితే ఈ సినిమా కొంతవరకు అఖిల్ ను సేఫ్ మోడ్ లోకి వెళ్లేలా చేసింది. ఇక తన తర్వాత సినిమా ప్రయత్నాలను మొదలు పెట్టాడు అఖిల్.
తెలుస్తున్న సమాచారం ప్రకారం అఖిల్ 3వ సినిమా డైరక్టర్ గా ఓ కొత్త దర్శకుడి పేరు వినబడుతుంది. తమిళంలో మలుపు సినిమా తీసిన సత్య పినిశెట్తి అఖిల్ తర్వాత సినిమా డైరెక్ట్ చేస్తున్నాడని టాక్. ఈ సినిమాపై మరో సర్ ప్రైజింగ్ న్యూస్ ఏంటంటే దగ్గుబాటి రానా ఈ సినిమా నిర్మిస్తాడని టాక్. అఖిల్ కెరియర్ సెట్ చేసే బాధ్యతను రానా మీద వేసుకున్నాడని అంటున్నారు.
మరి ఈ వార్తల్లో నిజమెంత అన్నది తెలియాలంటే మరికొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే. ఆది పినిశెట్టి సోదరుడైన సత్య పినిశెట్టి దర్శకుడిగా సత్తా చాటాలని చూస్తున్నాడు.