మాస్ రాజా 'టచ్ చేసి చూడు' టీజర్.. పక్కా హిట్టేనా..!

రెండేళ్ల తర్వాత రాజా ది గ్రేట్ సినిమాతో హిట్ అందుకున్న మాస్ మహరాజ్ రవితేజ ప్రస్తుతం విక్రం సిరికొండ డైరక్షన్ లో టచ్ చేసి చూడు సినిమా చేస్తున్నాడు. నల్లమలపు శ్రీనివాస్, వల్లభనేని వంశీ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ ఈరోజు రిలీజ్ అయ్యింది. మాస్ రాజా మాస్ యాక్షన్ తో వచ్చిన ఈ టీజర్ లో రవితేజ లుక్ అదిరిపోయింది. పక్కా మాస్ సినిమా అని చెప్పేలా వచ్చిన టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.

జాం8 మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ గా కనిపిస్తున్న రవితేజ రాజా ది గ్రేట్ హిట్ ను కంటిన్యూ చేస్తాడని అంటున్నారు. రవితేజ పోలీస్ గా నటించిన విక్రమార్కుడు, పవర్ రెండు హిట్టే కాబట్టి టచ్ చేసి చూడు సినిమా కూడా పక్కా హిట్ టచ్ చేస్తుందని అంటున్నారు. ముందు సంక్రాంతి రిలీజ్ అనుకున్న ఈ సినిమా జనవరి 26న రిలీజ్ చేస్తున్నారు.