
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగానే కాకుండా రాజకీయ నాయకుడిగా సమాజం మీద మరింత బాధ్యత వహించాల్సి ఉంది. తనపై ఎన్నో విమర్శలు కామెంట్లు వస్తున్నా వాటినేమి పట్టించుకోనట్టుగా ఉండే పవన్ అందుకు తగిన సమాధానం ఇస్తూనే ఉంటాడు. ఇక పవన్ పై ఈమధ్య ఎక్కువగా కామెంట్లు చేస్తున్న వారికి ఉదయాన్నే పవన్ పంచ్ వేశాడు. తన ట్వీట్ తో అందరికి తన సమాధానం చెప్పాడు.
ఇక పవన్ ట్వీట్ విషయానికొస్తే.. వ్యక్తిత్వంలో నిన్ను ఓడించడం చేతకాని వాళ్లు.. కులం, ధనం, వర్ణం అని మాట్లాడుతారు అంటూ పవన్ ట్వీట్ వేశాడు. ఇది కచ్చితంగా ఎవరిని ఉద్దేశించి వేశాడో అందరు గెస్ చేస్తున్నారు. ఈమధ్య పవన్ మీద శృతిమించి విమర్శలు చేస్తున్న అతగాడి మీదే పవన్ పంచ్ వేశాడని అంటున్నారు. అయితే ఈ విషయాన్ని తాను చెప్పకుండా తనకు ఎవరో పంపించారని చెప్పడం విశేషం. మొత్తానికి తన మీద వస్తున్న విమర్శలన్నిటిని పవన్ ఓ కంట కనిపెడుతూనే ఉన్నాడని తెలుస్తుంది.