
పవన్ త్రివిక్రం కాంబోలో వస్తున్న క్రేజీ మూవీ అజ్ఞాతవాసి ఈ నెల 10న రిలీజ్ అవబోతుంది. సంక్రాంతికి సందడి చేసేందుకు వస్తున్న ఈ సినిమా టీజర్ వచ్చింది కాని సినిమా రిలీజ్ నాలుగు రోజులే ఉండగా ఇప్పటిదాకా ట్రైలర్ మాత్రం రిలీజ్ కాలేదు. అయితే ట్రైలర్ విషయంలో చిత్రయూనిట్ జాప్యం ఎందుకు చేస్తుందో తెలియట్లేదు. ఇక సినిమా ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ అదిరిపోయే మ్యూజిక్ అందించాడు. ఓవర్సీస్ లో భారీ రేంజ్ లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా రికార్డులను క్రియేట్ చేయడం పక్కా అంటున్నారు. సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు ఫ్లాపుల తర్వాత పవన్ అజ్ఞాతవాసి అన్ని రికార్డులను సెట్ చేస్తుందని అంటున్నారు. మరి అనుకున్న ఫలితం అందుకుంటుందో లేదో చూడాలి.