ఈసారి బాలయ్యపై కత్తి కామెంట్..!

సినిమా క్రిటిక్ అని పేరు చెప్పుకుంటూ తద్వారా బిగ్ బాస్ షో పార్టిసిపెంట్ గా చేరి.. అక్కడ ఓ మోస్తారు ఐడెంటిటీ తెచ్చుకున్న కత్తి మహేష్ బయటకొచ్చాక పవన్ ఫ్యాన్స్ మీద వారిని నిలువరించలేని పవన్ కళ్యాణ్ మీద ఫైర్ అయ్యాడు. ఇక వారంలో ఏదో ఒక విషయం మీద పవన్ ను టార్గెట్ చేస్తూ కత్తి మహేష్ న్యూస్ లో నానుతూనే ఉన్నాడనుకోండి. 

తాజాగా పవన్ ఓ వైరస్ లాంటోడు.. హెచ్.ఐ.వి కన్నా ప్రమాదకారి అంటూ హద్ధులు దాటి విమర్శలు చేసిన కత్తి మహేష్ ఇప్పుడు బాలకృష్ణను వదల్లేదు. బాలకృష్ణ తానూ రాజు అన్నట్టు ఫీల్ అవుతుంటాడని.. తన వంశం మాత్రమే గొప్ప అని చెబుతాడని.. ఎమ్మెల్యే గా ఉంటూ ప్రజలను కొట్టడం సభ్యత కాదని.. ఆయనకు కౌన్సెలింగ్ ఇప్పించాలని అన్నాడు కత్తి మహేష్. పవన్ ఫ్యాన్స్ తాకిడికే బాబోయ్ అనేస్తున్న కత్తి మహేష్ ఇప్పుడు నందమూరి ఫ్యాన్స్ ను కెలికేశాడు. మరి దీని పర్యావసానాలు ఎలా ఉంటాయో చూడాలి.