అఖిల్ థర్డ్ మూవీ.. డైరక్టర్ రేసులో అతను..!

అక్కినేని అఖిల్ హీరోగా మొదటి ప్రయత్నం అఖిల్ ఫెయిల్యూర్ అటెంప్ట్ కాగా రెండవ సినిమా కాస్త పర్వాలేదు అనిపించింది. విక్రం కుమార్ డైరక్షన్ లో హలో అంటూ ప్రేక్షకులను పలుకరించిన అఖిల్ ఈ సినిమాతో హీరోగా నిలబడినట్టే అని చెప్పొచ్చు. నాగార్జున నిర్మించిన ఈ సినిమా అంచనాలను అందుకోలేదు కాని అఖిల్ కెరియర్ కు మంచి బూస్టప్ ఇచ్చింది. అయితే అఖిల్ తన తర్వాత సినిమా ఎవరితో చేస్తాడు అన్న విషయంపై చర్చలు మొదలయ్యాయి.

నిన్న మొన్నటిదాకా సుకుమార్, కొరటాల శివ, వంశీ పైడిపల్లి రేసులో ఉన్నారని అనగా ఇప్పుడు కొత్తగా సత్య పినిశెట్టి పేరు వినబడుతుంది. ఈమధ్యనే సత్య ఓ లైన్ అఖిల్ కు వినిపించాడట. దానికి అఖిల్ కూడా సై అన్నట్టు టాక్. తన 3వ సినిమా వివరాలను జనవరి 10న ఎనౌన్స్ చేస్తానని చెప్పిన అఖిల్ సత్య పినిశెట్టి సినిమానే ఫైనల్ చేస్తాడని ఫిల్మ్ నగర్ టాక్. ఇంతకీ సత్య ఎవరో కాదు సరైనోడు విలన్ ఆది పినిశెట్టి బ్రదరే.. అంటే రవిరాజా పినిశెట్టి మరో తనయుడన్నమాట.  మరి ఈ కాంబోలో సినిమా వస్తే ఎలా ఉంటుందో చూడాలి.