
డిసెంబర్ 31 రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన ప్రదీప్ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. తను డ్రైవ్ చేస్తున్న బి.ఎం.డబల్యు కార్ వదిలి మరి వెళ్లాడు. అయితే ఆ తర్వాత మూడు నాలుగు రోజులు గడుస్తున్నా ప్రదీప్ మాచిరాజు పోలీస్ కౌన్సెలింగ్ కు అటెండ్ అవలేదు. ఈలోగా మీడియా మొత్తం నానా రకాల రచ్చ చేసింది. ఎలా బడితే అలా ఏం పడితే అది న్యూస్ ప్రెజెంట్ చేస్తూనే ఉంది.
అయితే ఇలానే ఉంటే ఇంకేం జరుగుతుందో అని ఊహించిన ప్రదీప్ ఫైనల్ గా ఓ వీడియో మెసేజ్ రిలీజ్ చేశాడు. నమస్కారం నా పేరు ప్రదీప్ మాచిరాజు.. డిసెంబర్ 31న రాత్రి ఏం జరిగిందో అందరికి తెలిసిందే అంటూ మొదలు పెట్టి తన తప్పుని ఒప్పుకున్నట్టే చెప్పుకొచ్చాడు. లా ప్రకారం కౌన్సెలింగ్ మిగతా ప్రొసీడింగ్స్ అన్నిటిని తప్పకుండా ఫాలో అవుతా అని చెప్పుకొచ్చాడు ప్రదీప్. అంతేకాదు లాస్ట్ ఇయర్ తానే డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దని చెప్పి వాటిని ఉల్లంఘించడం దురద్రుష్టకరమని అన్నాడు. మీడియా మిత్రులు, ప్రేక్షకులు తాను కనిపించకుండా పోయానని కంగారు పడుతున్నారని.. ముందు ఇచ్చిన కమిట్మెంట్స్ వల్ల షూటింగ్ లో బిజీగా ఉండి.. కొన్ని ఇంపార్టెంట్ కాల్స్ మిస్ చేసుకున్నా అని వివరణ ఇచ్చుకున్నాడు ప్రదీప్.