త్రివిక్రం వెంకటేష్ చేసేది ఆ రీమేకేనా..!

విక్టరీ వెంకటేష్ త్రివిక్రం కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ సినిమా రీమేక్ గా వీరి కాంబినేషన్ లో సినిమా వస్తుందని అంటున్నారు. అక్షయ్ కుమార్ నటించిన జాలీ ఎల్.ఎల్.బి-2 రీమేక్ గా వెంకటేష్, త్రివిక్రం సినిమా వస్తుందని అంటున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంలోనే ఈ సినిమా వస్తుందట. ప్రస్తుతం వెంకటేష్ తేజ డైరక్షన్ లో ఆటా నాదే వేటా నాదే సినిమా చేస్తున్నాడు.

ఇక ఈ సినిమా తర్వాత త్రివిక్రం అనీల్ రావిపుడితో ఓ మల్టీస్టారర్ సినిమా లైన్ లో పెట్టాడు. ఇక త్రివిక్రం కూడా అజ్ఞాతవాసి కాగానే తారక్ సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్తున్నాడు. ఆ సినిమా పూర్తయ్యక వెంకటేష్ తోనే చేస్తాడని తెలుస్తుంది. మరి కాంబినేషన్ సెట్ అయినా ఎప్పుడు షూటింగ్ కు వెళ్తుందో చూడాలి. వెంకటేష్ హీరోగా నటించిన నువ్వు నాకు నచ్చాయ్, మళ్లీశ్వరి సినిమాలకు మాటలను అందించాడు త్రివిక్రం. ఆ టైంలోనే వెంకటేష్ త్రివిక్రం టాలెంట్ ను గుర్తించాడు.