లిప్ లాక్స్ కు అది అడ్డొస్తుంది..!

సౌత్ సిని పరిశ్రమలో అతి తక్కువ టైంలోనే ఆడియెన్స్ మనసులను గెలుచుకున్న భామ అమలా పాల్. మలయాళం నుండి వచ్చిన ఈ అమ్మడు తమిళంలో స్టార్ క్రేజ్ సంపాదించింది. తెలుగులో ఒకటిరెండు సినిమాల్లో నటించగా ఇక్కడ క్రేజ్ తెచ్చుకుంది. ఇక డైరక్టర్ విజయ్ ను ప్రేమించి పెళ్లాడిన అమలా రెండేళ్లకే విడాకులు కూడా తీసుకున్నారు. డైవర్స్ తర్వాత మళ్లీ సినిమాల మీద దృష్టి పెట్టిన అమలా దర్శక నిర్మాతలకు హింట్ ఇచ్చేస్తుంది.

రీసెంట్ గా ఓ మేగజైన్ కవర్ పేజ్ కోసం ఫోటో షూట్ చేసిన ఈ అమ్మడు లిప్ లాక్స్ పై తన అభిప్రాయాన్ని చెప్పింది. లిప్ లాకులకు తాను ఏమి అడ్డు చెప్పనని.. అయితే లిప్ లాక్స్ టైంలో లిప్ స్టిక్ లేకుండా ఉంటే ఇంకాస్త కన్వినెంట్ గా ఉంటుందని అంటుంది అమలా. మరి అదరచుంభనాల గురించి ఇంత డీటైల్డ్ గా మాట్లాడుతున్న అమ్మడు అలాంటి సీన్స్ కు తాను సై అని చెప్పకనే చెబుతుందని అంటున్నారు. మరి అమ్మడికి ఆ ఛాన్స్ ఎవరు ఎప్పుడు ఇస్తారో చూడాలి.