రాజమౌళి ఆరోజు చెప్పేస్తాడట..!

బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమాపై ఇప్పటికే వార్తలు వస్తుండగా అవి నిజమే అంటూ కన్ఫాం చేశారు. రాజమౌళి డైరక్షన్ లో ఎన్.టి.ఆర్, చరణ్ క్రేజీ మల్టీస్టారర్ రాబోతుంది. 2018 అక్టోబర్ 10న రాజమౌళి బర్త్ డే రోజున మొదలవనున్న ఈ సినిమా అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ 2018 సంక్రాంతి నాడు చెప్పేస్తారట. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. 

స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న మెగా నందమూరి మల్టీస్టారర్ సినిమాలో హీరోలిద్దరు బాక్సర్స్ గా కనిపిస్తారని తెలుస్తుంది. అక్టోబర్ లో మొదలు పెట్టి 2019 సమ్మర్ కల్లా సినిమా ఫినిష్ చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ సిద్ధం కాగా ఫైనల్ టచింగ్ ఇస్తున్నారట. మరి ఈ సినిమా మిగతా కాస్ట్ అండ్ క్రూ ఎవరన్నది త్వరలో వెళ్లడిస్తారని తెలుస్తుంది.