
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా హిట్ అయితే ఆ సినిమా కలక్షన్స్ లెక్క వేరేలా ఉంటుంది. సినిమా సగం లీక్ అయినా అత్తారింటికి దారేది సినిమా సంచలనాలు సృష్టించింది. ఇక ఆ క్రేజీ కాంబినేషన్ లోనే త్రివిక్రం డైరక్షన్ లో వస్తున్న సినిమా అజ్ఞాతవాసి. ఈ నెల 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న అజ్ఞాతవాసి సినిమా నైజాంలో 28.5 కోట్లకు కొనేశాడట దిల్ రాజు.
నైజాంలో పవర్ స్టార్ స్టామినా ఏంటో తెలిసిన దిల్ రాజు అంత పెట్టేందుకు వెనుకాడలేదు. అయితే అజ్ఞాతవాసి హిట్ అయినా నైజాం కలక్షన్స్ 30 కోట్ల పైన వస్తేనే దిల్ రాజుకి లాభాలు వచ్చేది. అసలు అజ్ఞాతవాసి సినిమాకు దిల్ రాజు ఎందుకు అంత రిస్క్ చేశాడు. పవన్ సినిమాపై అంత గురి ఎందుకు అన్నది తెలియాల్సి ఉంది. సినిమా ఆల్రెడీ చూసున్న దిల్ రాజు రికార్డులు క్రియేట్ చేయడం పక్కా అని చెబుతున్నాడట.