నిత్యా లెస్బియన్ గానా..బాప్రే

తక్కువ టైంలోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న నిత్యా మీనన్ హీరోలతో శృంగార సన్నివేశాల్లోనే తక్కువగా నటిస్తుంది. అలాంటిది ఇప్పుడు ఏకంగా లెస్బియన్ గా నటించేందుకు సిద్ధమైందట. కథ.. క్యారక్టర్ డిమాండ్ చేస్తే తాను ఎలాంటి ప్రయోగానికైనా సిద్ధమే అని చెబుతూ వస్తున్న నిత్యా మీనన్ నిజంగానే ఇప్పుడు ఓ లెస్బియన్ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పిందట.

ప్రముఖ దర్శకుడు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో తెలుగు హీరోయిన్ గా లెస్బియన్ గా కనిపించనుందట. అంతేకాదు నిత్యాతో లిప్ లాక్స్ కూడా ఉంటాయని తెలుస్తుంది. మరి చేతిలో సినిమాల్లేని కారణం చేత ఇలాంటి సినిమా చేస్తుందా లేక మరేమో కాని నిత్యా మీనన్ ఈ సినిమా చేస్తుందన్న న్యూస్ తన ఫ్యాన్స్ కు షాక్ ఇస్తుంది. మరి ఈ సినిమా ఎవరు తీస్తున్న ఏయే భాషల్లో తీస్తున్నారు కథ ఏంటి అన్నది మరికొద్దిరోజుల్లో తెలుస్తుంది.