త్రివిక్రంపై కత్తి మహేష్ కామెంట్స్..!

కొన్నాళ్లుగా పవన్ కళ్యాణ్ మీద అతని ఫ్యాన్స్ మీద విమర్శనాస్త్రాలు సంధిస్తూ స్టూడియోల చుట్టూ రౌండ్ వేస్తున్న కత్తి మహేష్ ఓ పక్క పవన్ ను టార్గెట్ చేస్తూనే ఇప్పుడు తన ఫోకస్ పవన్ సన్నిహితుడు దర్శకుడు త్రివిక్రం మీద పెట్టాడని అంటున్నారు. ఎందుకంటే అజ్ఞాతవాసి కాపీ న్యూస్ పై వస్తున్న వార్తలపై కత్తి మహేష్ స్పందించిన తీరే దీనికి నిదర్శనం. సినిమా కాపీ అన్నదానికి స్పందించకుండా త్రివిక్రం కాపీ కొట్టడం అలావాటే అన్నట్టుగా కామెంట్ చేశాడు.

అంతేకాదు యండమూరి వీరేంద్రనాధ్ కథలను పాత్రలను ఆలోచనలను కాపీ కొడతాడంటూ సంచలన కామెంట్లు చేశాడు. అలా కాపీ చేసే వారు లేకనే మన ఖర్మ కొద్ది త్రివిక్రం పెద్ద దర్శకుడు అయ్యాడంటూ మహేష్ కత్తి ట్విట్టర్ లో మెసేజ్ పెట్టాడు. మరి అతగాడి అసలు టార్గెట్ ఏంటో కాని ఏకంగా మాటల మాంత్రికుడినే ఫోకస్ చేస్తూ కామెంట్ చేశాడు. మరి కత్తి కామెంట్స్ పై ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.