ప్రదీప్ పరారీలో ఉన్నాడా..!

యాంకర్ ప్రదీప్ న్యూ ఇయర్ షాక్ నుండి ఇంకా తేరు కోలేదు. మిడ్ నైట్ ఫుల్ గా మందు కొట్టి పోలీసులకు దొరికిన ప్రదీప్ మాచిరాజు కారు అదుపులోకి తీసుకుని రెండు రోజుల్లో కౌన్సెలింగ్ కు రమ్మనా సరే రాకుండా తప్పించుకున్నాడు. ఈరోజు మధ్యాహ్నం కల్లా రాకుంటే చార్జ్ షీట్ ఫైల్ చేస్తారని తెలిసినా లక్షల విలువ చేసే బి.ఎం.డబల్యు కారుని సైతం వదిలేసి ప్రదీప్ పరారయ్యాడని తెలుస్తుంది.

పోలీసులు ప్రదీప్ కోసం ఇంటికి వెళ్లగా అక్కడ తను ఇంట్లో లేడని చెప్పారట. రెండు రోజులుగా సోషల్ మీడియాలో ప్రదీప్ పై హడావిడి తెలిసిందే. అంతేకాదు ప్రదీప్ కారులో మరో ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. అయితే వారు కూడా సిని పరిశ్రమకు సమంబందించిన వారే అంటూ కామెంట్లు వస్తున్నాయి. తాగి డ్రైవ్ చేస్తే ఎలాంటి అనర్ధాలు వస్తాయో ఇదవరకు ప్రదీపే ఓ ప్రోగ్రాంలో చెప్పాడు.. ఇప్పుడు తన క్లిప్పింగులు తన వార్తలకే వేస్తూ హంగామా చేస్తున్నారు మీడియా వాళ్లు.