మారుతిపై సునీల్ కస్సు బుస్సు..!

కమెడియన్ నుండి హీరోగా టర్న్ అయిన సునీల్ హీరోగా నిలదొక్కుకోలేకపోయాడు. ఈమధ్య అన్ని అపజయాలే చవిచూస్తున్న సునీల్ మారుతి తీసిన భలే భలే మగాడివోయ్ కథను కాదన్నాడన్న వార్త తెలిసిందే. మారుతి చెప్పిన వర్షన్ ప్రకారం మతిమరువు హీరోగా చెప్పిన ఆ కథను ఒక్కడు లాంటి బ్యాక్ డ్రాప్ తో తీయమని సునీల్ సలహా ఇచ్చాడట. అయితే సునీల్ సలహా నచ్చని మారుతి తర్వాత కలుద్దామని వెళ్లి నానితో సినిమా తీసి హిట్ కొట్టాడు.

అయితే ఆ సినిమా ప్రస్థావనలో భాగంగా మారుతిపై నిప్పులు చరిగాడు సునీల్. మహేష్ ఒక్కడుకి భలే భలే మగాడివోయ్ కు సంబంధం ఎలా ఉంటుంది. మారుతి తనకు లైన్ మాత్రమే చెప్పాడని.. లైన్ బాగుంది డెవలప్ చేసుకుని రా అని చెప్పానని.. తీరా చూస్తే నానితో అదే సినిమా చేశాడని చెప్పుకొచ్చాడు సునీల్. మరి ఈ ఇద్దరి వర్షన్ లో ఎవరిది నిజం తెలియదు కాని నాని చేసిన భలే భలే మగాడివోయ్ సినిమా మిస్ అయినందుకు సునీల్ బాధపడుతున్నట్టు తెలుస్తుంది.