
బాహుబలి సినిమాతో రాజమౌళితో పాటుగా ఆ సినిమాలో హీరోగా నటించిన ప్రభాస్ కు నేషనల్ వైడ్ ఫాలోయింగ్ ఏర్పడింది. ప్రస్తుతం సుజిత్ డైరక్షన్ లో సాహో సినిమా చేస్తున్నాడు. యువి క్రియేషన్స్ బ్యానర్లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ప్రభాస్ తన తర్వాత సినిమా కూడా యువి బ్యానర్లోనే చేస్తాడని తెలుస్తుంది. ఆ సినిమాకు దర్శకుడిగా రాధాకృష్ణ వ్యవహరిస్తాడని తెలుస్తుంది.
జిల్ సినిమాతో దర్శకుడిగా తన ప్రతిభ చాటిన రాధాకృష్ణ రెండో సినిమానే ప్రభాస్ తో చేయబోతున్నాడట. ఇక ఈ రెండు సినిమాలే కాకుండా పెదనాన్న కృష్ణంరాజు డైరక్షన్ లో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట ప్రభాస్. కృష్ణం రాజు సొంత బ్యానర్ అయిన గీతాకృష్ణ నిర్మాణంలో ఆ సినిమా వస్తుందట. ఈ సినిమాకు టైటిల్ గా దందా అని పెట్టబోతున్నారట. బాహుబలి ఇచ్చిన ధైర్యంతో కృష్ణంరాజు కూడా ప్రభాస్ తో దందా చేయాలని చూస్తున్నాడు. మరి ఈ సినిమా ఎలా ఉంటుంది అన్న మిగతా విషయాలన్ని త్వరలో వెళ్లడవుతాయి.