ఎన్టీఆర్, చరణ్ లకు రాజమౌళి డెడ్ లైన్..!

బాహుబలి తర్వాత రాజమౌళి చేసే సినిమా ఏదై ఉంటుందా అన్న వార్తలకు షాక్ ఇస్తూ బాహుబలిని మించిన భారీ మల్టీస్టారర్ తో తన తర్వాత సినిమా ప్లాన్ చేశాడు రాజమౌళి. డివివి దానయ్య నిర్మాణంలో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ తో జక్కన్న మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ ఫైనల్ చేసే పనిలో ఉండగా త్వరలోనే అఫిషియల్ స్టేట్మెంట్ ఇస్తారని తెలుస్తుంది.

ప్రస్తుతం రాం చరణ్ రంగస్థలం పూర్తి చేసే పనిలో ఉండగా.. ఆ తర్వాత బోయపాటి శ్రీను సినిమా ఓకే చేశాడు. ఇక తారక్ కూడా త్రివిక్రం సినిమా ఫిబ్రవరి నుండి సెట్స్ మీదకు తీసుకెళ్తున్నాడు. ఈ ఇద్దరికి అక్టోబర్ దాకా టైం ఇచ్చాడట రాజమౌళి. 2018 అక్టోబర్ లో వారి సినిమా మొదలు పెట్టాలని ఫిక్స్ చేశాడట. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమాలో చరణ్, తారక్ ఇద్దరు బాక్సర్స్ గా నటిస్తారని టాక్.