
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న సినిమా అజ్ఞాతవాసి. జల్సా, అత్తారింటికి దారేది సినిమాల తర్వాత పవన్ కళ్యాణ్ తో త్రివిక్రం చేసిన ఈ హ్యాట్రిక్ మూవీ హ్యాట్రిక్ హిట్ షురూ చేస్తుందని అంటున్నారు. ఇక ఈ సినిమా నైజాం రైట్స్ టాలీవుడ్ లో సంచలనాలు క్రియేట్ చేస్తుంది. బాహుబలి లాంటి సినిమాను కూడా బీట్ చేస్తూ అజ్ఞాతవాసి సినిమా నైజాం లో అత్యధికంగా 27 కోట్ల దాకా రేటు పలికిందట.
ఈ రేంజ్లో ప్రీ రిలీజ్ జరగడం అంటే సినిమాపై ఎన్ని అంచనాలున్నాయో అర్ధం చేసుకోవచ్చు. టాలీవుడ్ హిస్టరీలోనే నైజాంలో ఈ రేంజ్ బిజినెస్ జరగడం ఇదే మొదటిసారి కలక్షన్స్ ఎలా వచ్చినా ప్రీ రిలీజ్ బిజినెస్ లో నైజాం లో పవన్ ను మించినోడు లేడని అంటున్నారు. కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్స్ గా నటిస్తున్న అజ్ఞాతవాసి సినిమాకు అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ అందించారు.
ఈ సినిమాలో పవన్ కూడా ఓ సాంగ్ పాడటం జరిగింది. న్యూ ఇయర్ గిఫ్ట్ గా కొడకా కోటేశ్వర్ రావు సాంగ్ రిలీజ్ చేశారు. అంతేకాదు సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్న అజ్ఞాతవాసి యు/ఏ సర్టిఫికెట్ అందుకుంది.