
మెగస్టార్ చిరంజీవి మరోసారి తన సహృదయాన్ని చాటుకున్నారు. ఆరోగ్య రీత్యా బాధపడుతున్న పొట్టి వీరయ్యకు 2 లక్షల ఆర్ధిక సాయాన్ని అందించి అతన్ని ఆదుకున్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ప్రోత్సాహంతో పొట్టి వీరయ్య మళ్లీ మాములు మనిషి కాగలిగాడు. ఇక తన ఆపరేషన్ కు ఆర్ధిక సాయాన్ని అందించిన మెగాస్టార్ చిరంజీవికి కృతజ్ఞతలు తెలిపాడు పొట్టి వీరయ్య.
చిరంజీవి ఇంటికి వెళ్లి మరి పొట్టి వీరయ్య చిరుకి తన కృతజ్ఞతలను తెలిపాడు. కేవలం పొట్టి వీరయ్యకే కాదు ఇటీవల అనారోగ్య సమస్యతో బాధపడుతున్న గుండు హనుమంతురావుకి చిరంజీవి ఆర్ధిక సాయాన్ని అందించారు. మా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. శివాజిరాజా మా అధ్యక్షుడిగా ఉండగా కష్టాల్లో ఉన్న కళాకారులను ఆదుకునేందుకు మహా యజ్ఞమే చేస్తున్నారు.